నవతెలంగాణ – మల్హర్ రావు
పది పాసైన విద్యార్థులు మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని గ్రామ సర్పంచ్ బందీ స్వామి,కళాశాల అధ్యాపకులు కోరారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్య వారోత్సవాలను మూడవరోజు ప్రిన్స్ పల్ విజయదేవి ఆదేశాల మేరకు బుధవారం గ్రామంలో అధ్యాపకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పదవ తరగతి పాసైన విద్యార్థులు ఎవరు కూడా డ్రాప్ అవుట్ కాకుండా స్థానిక కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాలని తెలిపారు.ముఖ్యంగా విద్యార్థినుల తల్లిదండ్రులు తప్పకుండా పై చదువులు చదివించాలని,చదువు మానేయకుండా చూడాలని కోరారు.తాడిచర్ల జూనియర్ కళాశాల ఇంటర్ వార్షిక పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించింనందుకు గాను కళాశాల ప్రిన్సిపాల్ విజయదేవిని,అధ్యాపకులను అభినందించారని చెప్పారు.పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు,బాపు, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
పది పాసైన విద్యార్థులు స్థానిక కళాశాలలో చేరాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



