ఆర్టీఐ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
నిట్ 2026 పేపర్ లికేజీతో దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే విధంగా ఉందని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలో మాట్లాడారు నీట్-2026 పరీక్షలో పేపర్ లీకేజీ ఘటన అత్యంత దారుణమైన సంఘటనని అభిప్రాయం వ్యక్తం చేశారు.రాజస్థాన్‌లోని సికర్ ప్రాంతం నుంచి లీక్ నెట్‌వర్క్ బయటపడిందని, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ప్రశ్నాపత్రం ప్రచారం జరిగిందని ఆరోపించారు.పరీక్ష నిర్వహణలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు కష్టపడి చదువుతుంటే డబ్బు, కోచింగ్ మాఫియా, అవినీతి ఆధారంగా కొందరికి ప్రశ్నాపత్రాలు చేరడం ప్రమాదకరమన్నారు.నీట్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.వారి వెంటా జిల్లా జిల్లా కార్యవర్గ సభ్యుడు వేనాచారి ఉన్నారు.
నీట్ పేపర్ లీక్ విద్యార్థుల భవిష్యత్ పై ప్రభావితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



