Thursday, May 14, 2026
E-PAPER
Homeకరీంనగర్కరీంనగర్ చోరీ కేసు..ముగ్గురు అరెస్ట్

కరీంనగర్ చోరీ కేసు..ముగ్గురు అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: కరీంనగర్‌లో పీఎంజే జ్యువెల్లరీలో చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను కరీంనగర్‌ సీపీ గౌస్ ఆలం వివరాలను మీడియాకు వెల్లడించారు.నగల దుకాణం దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.మొత్తం 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు చోరీకి గురయిందన్నారు. బంగారం దోపిడీ కేసులో సుబోధ్‌ సింగ్‌ ప్రధాన నిందితుడు అని పోలీసులు తెలిపారు.

దోపిడీ తర్వాత రైలు, బస్సు ద్వారా తప్పించుకునేందకు ప్రయత్నించారు. దోపిడీకి రెండు నెలల క్రితమే రెక్కీ నిర్వహించారని పేర్కొన్నారు. ఈ గ్యాంగ్‌పై పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో సుబోధ్‌ సింగ్ ముఠా చోరీలకు పాల్పడిందన్నారు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసులను సీపీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -