నవతెలంగాణ – చండూరు : పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, నేటి పోటీ ప్రపంచంలో బాధ్యతాయుతమైన, క్రమశిక్షణతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ పాఠశాలలకే సాధ్యమని బంగారిగడ్డ జడ్పీహెచ్ఎస్ గెజిట్ ప్రధానోపాధ్యాయులు పివి మేరీ అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రజాప్రణాళిక కార్యక్రమ నిర్వహణలో భాగంగా బడిబాట, మెగా పేటీఎం (తల్లిదండ్రుల సమావేశం) కార్యక్రమం నిర్వహించారు.
ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో పల్లె లక్ష్మీ ప్రసన్న 529/600, దాసరి తిరుమలేష్ 523/600, బేరి వైష్ణవి 513/600, నేర్ల గాయత్రి 507/600 మార్కులు సాధించినట్లు గెజిట్ ప్రధానోపాధ్యాయులు తెలిపారు. వీరికి ఆ గ్రామ సర్పంచ్ బోయపల్లి సునీత, ఉప సర్పంచ్ మహబూబ్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు, నగదు పంపిణీ చేశారు. కేతపల్లి శిరీష 472, తిరుపతి శివ 472, జక్కలి రామ్ చరణ్ 463 ఈరిగి పావని 460, ఈరటి యమ్మున 457, దేసిది చందు 456 మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో ఇంత మంచి మార్కులు రావడం అభినందనీయం అన్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నందుకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్థాయిలో రానున్న రోజుల్లో మరిన్ని మార్కులు సాధించేలా విద్యను అందించాలని వారు కోరారు. గ్రామం నుండి హై స్కూల్ కు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయుని ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



