Thursday, May 14, 2026
E-PAPER
Homeఖమ్మంకమీషనర్ కు ఆదేశాలు జారీ చేసిన మంత్రి తుమ్మల

కమీషనర్ కు ఆదేశాలు జారీ చేసిన మంత్రి తుమ్మల

- Advertisement -

– అశ్వారావుపేటను అభివృద్ధి పథంలో పెట్టండి
– కమీషనర్ దిలీప్ రెడ్డికి మంత్రి తుమ్మల ఆదేశం
నవతెలంగాణ – అశ్వారావుపేట
: అశ్వారావుపేటను ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని, తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న ఈ పట్టణాన్ని మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మున్సిపల్ కమీషనర్ దిలీప్ రెడ్డికి సూచించారు. ఉద్యాన కళాశాల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి తుమ్మలను కమీషనర్ దిలీప్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధిపై మంత్రి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా డివైడర్లలో పూల మొక్కలు నాటించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. గ్రూప్-1 అధికారి హోదాలో బాధ్యతలు చేపట్టిన దిలీప్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండి డైనమిక్‌గా పనిచేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఛాన్సలర్ రాజిరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -