నవతెలంగాణ-హైదరాబాద్: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ శాసనసభలో ప్రతిపక్షనేతగా పినరయి విజయన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గురువారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ.బేబీ, ఏ.విజయరాఘవన్,పినరయి విజయన్‌తో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు. కమిటీ నిర్ణయాలను ఆ రాష్ట్ర CPI(M) రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ తెలియజేశారు. పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఎల్డీఎఫ్ తరుపున అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా పినరయి ప్రజా సమస్యలపై ప్రశ్నించనున్నారని ఆయన వెల్లడించారు. కాగా యూడీఎప్ తరుపున కాంగ్రెస్ వీడీ. సతీశన్‌ను సీఎం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. గత నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎప్ 102 సీట్లు సాధించిగా LDF 35 స్థానాలు గెలుచుకుంది.
కేరళ ప్రతిపక్షనేతగా పినరయి విజయన్ ఏకగ్రీవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


