Friday, February 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి...ఐదుగురు మృతి

పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి…ఐదుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి జరగ్గా.. ఐదుగురు అమాయకులు మృతి చెందారు. ప్రో-గవర్నమెంట్ కమ్యూనిటీ లీడర్ అలాం మెహ్‌సూద్ నివాసంలో పెళ్లి కార్యక్రమాలు జరుగుతుండగా ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) పాత్ర ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -