- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన 16 ఏళ్ల బాలిక, వేసవి సెలవులకు తిరుపతిలోని పిన్ని ఇంటికి వెళ్లింది. అక్కడ పిన్ని భర్త రామమూర్తి, బాలిక వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చిన బాలిక మానసిక స్థితిని గమనించిన తల్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తల్లి ఫిర్యాదుతో జగద్గిరిగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. నిందితుడిపై లైంగికదాడి, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
- Advertisement -



