Saturday, May 16, 2026
E-PAPER
Homeజాతీయంఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులు బంద్‌

ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులు బంద్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడనున్నాయి. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నకిలీ, ప్రమాదకర మందులు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ సేవలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ బంద్ కారణంగా 12.40 లక్షలకు పైగా మెడికల్ షాపులు మూతపడనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -