నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో సిద్ధమవుతున్నారు. రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 29న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా శనివారం విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. ఎమోషన్స్‌తో పాటు మిస్టరీ అంశాలతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో వెంకట లక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించారు. సంజు పాత్రలో విరాజ్ అశ్విన్ కనిపించగా.. మరీచిక పాత్రలో రెజీనా కసాండ్రా కనిపించారు. సంజుని మరీచిక చంపేసిందంటూ అనుపమ పరమేశ్వరన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటం.. ఆ తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్.. ఎన్నారై అమ్మాయి మరీచిక పాత్రలో రెజీనా కనిపించింది. ఈ మూడు పాత్రల మధ్య జరిగిన ఎమోషనల్, థ్రిల్లింగ్ ట్విస్టులు, టర్నులతో సినిమా ఉండనుందని ట్రైలర్‌తో చాలా ఆసక్తికరంగా చూపించారు. కథ ముందుకు సాగేకొద్దీ పాత్రల మధ్య ఉన్న సంబంధాలు మారిపోతూ కనిపించాయి.



