రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’తో హీరో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ నబాకాంత్ మీడియాతో సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు. అసిస్టెంట్ మాస్టర్‌గా విజయ్ మాస్టర్, రామ్-లక్ష్మణ్ మాస్టర్ల దగ్గర పని చేశాను. ‘పుష్ప’ మూవీతో యాక్షన్ కొరియోగ్రాఫర్ అయ్యాను. ఆ తర్వాత ‘పుష్ప 2’, మనశంకర వరప్రసాద్, ‘డెకాయిట్’… ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలు చేశాను. ‘పుష్ప 2’ జరుగుతున్నప్పుడే బుచ్చిబాబు నాతో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలతో గ్లింప్స్‌లో చూపించిన బ్యాటింగ్ స్టైల్ షాట్ కంపోజ్ చేశాను. అది దేశవ్యాప్తంగా చాలా వైరల్ అయింది. దానికి సంబంధించిన క్రెడిట్ మొత్తం బుచ్చిబాబు నాకే ఇచ్చారు. ‘పెద్ది’లో ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. చరణ్ ప్రేక్షకులను ‘పెద్ది’ వరల్డ్‌లోకి తీసుకెళ్లిపోతారు. ఆయన పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుంది. సినిమాలో యాక్షన్ మరో లెవెల్‌లో ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ ఫ్రెష్‌గా ఉంటుంది. బుచ్చిబాబు ఇచ్చిన యాక్షన్ సీక్వెన్స్‌లు అన్నీ కూడా ఛాలెంజ్‌గా తీసుకుని చేశాను. చిరంజీవికి చరణ్ యాక్షన్ సీక్వెన్స్‌లు చూపించారు. నా గురించి చాలా మంచిగా చెప్పారు. ‘ప్యారడైజ్’, ‘రౌడీ జనార్ధన్’, వంశీ – సల్మాన్ ఖాన్, చిరంజీవి – బాబి సినిమాలు చేస్తున్నాను.
– నబాకాంత్
నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయి
- Advertisement -
- Advertisement -



