రాజు, రాణితో ప్రధాని భేటీ
ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
దిహేగ్ : ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం యూఏఈలో పర్యటించిన ఆయన.. వనివారం నెదర్లాండ్స్‌లో తన పర్యటనను కొనసాగించారు. ముందుగా భారతీయ సమాజాన్ని కలిసి కీలక ప్రసంగం చేశారు. అనంతరం నెదర్లాండ్స్ ప్రభుత్వ పెద్దలతో సమావేశమై కీలక చర్చలు జరిపారు. ఇక ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ రాజు విలెమ్ అలెగ్జాండర్, రాణి మాక్సిమాను రాజభవనంలో మోడీ కలిశారు. ఈ సందర్భంగా భారత్-నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్ భాగస్వామ్యంపై కీలక చర్చలు జరిగినట్టు మోడీ వెల్లడించారు. ఈ భేటీ అనంతరం ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘రాయల్ ప్యాలెస్‌లో రాజు విలెమ్-అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను కలిశాను. సాంకేతికత, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, వాణిజ్యం, జల వనరులు వంటి కీలక రంగాల్లో భారత్-నెదర్లాండ్స్ స్నేహాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం ఆనందంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు. అలాగే భారత్, నెదర్లాండ్స్ దేశాలు పరస్పర ప్రయోజనాలతో పాటు భవిష్యత్ తరాలకు అనుకూలమైన ప్రపంచ నిర్మాణం అనే ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయని మోడీ వివరించారు. ఇక మోడీ సమక్షంలో టాటా ఎలక్ట్రానిక్స్, ఏఎస్‌ఎంఎల్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.
నెదర్లాండ్స్‌లో మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



