నవతెలంగాణ-హైదరాబాద్: చైనాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. సోమవారం తెల్లవారుజామున చైనా నైరుతి ప్రాంతమైన గ్వాంగ్జీలో సంభవించిన భూప్రకంపనల వల్ల ఇద్దరు మృతి చెందారు. ఒకరు గల్లంతయ్యారు. నలుగురికి త్రీవ గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని చికిత్స కోసం ఆసుప్రతికి తరలించారు. ఈ ఘటన వల్ల గ్వాంగ్జీలోని ప్రధాన నగరమైన లియుజౌలోని 7,000 మందికి పైగా ప్రజలను రెస్క్యూ సిబ్బంది అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రెస్క్యూ సహాయక సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భూకంపానికి బహుళ అంతస్తుల 13 భవానాలు కూలిపోయాయి. రైల్వే లైన్లు తెగిపోయాయి. వీటితోపాటు రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి అని ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. అయితే భూకంప ప్రభావిత ప్రాంతంలో కమ్యూనికేషన్, విద్యుత్ లైన్లు, నీటి, గ్యాస్ సరఫరా, ట్రాఫిక్ సాధారణంగా పని చేస్తున్నాయని ప్రభుత్వ మీడియా నివేదించింది.
చైనాలో భారీ భూకంపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



