నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు చెలుక కు నిప్పంటించారని సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడు తెలిపారు. ఈ ప్రమాదంతో చెత్తాచెదారం ముళ్లపదలు చెట్లు అంటుకుని మంటలు ఊర్లోకి వ్యాపించాయని అన్నారు. దీంతో వెంటనే స్పందించిన గ్రామస్తులు గ్రామ సరంచ్ యాకాంతం గౌడ్, నెల్లికుదురు ఎస్సై చిర్రా రమేష్ బాబుకు సమాచారం అందించారు. అదేవిధంగా ఫైర్ స్టేషన్ కు కూడా విషయాన్ని తెలియజేశారు.
ఈ క్రమంలో హుటాహుటిన ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. గ్రామస్తుల సాయంతో పాటు సబ్బందితో కలిసి చెలరేగిన మంటను అదుపు చేశారు. సరైన సమయానికి ఫైర్ సిబ్బంది స్పందిచకుంటే పరిస్తితి చాలా దారుణంగా ఉండేదని సర్పంచ్ విచారం వ్యక్తం చేశారు. మరోవైపు బొల్లు చంద్రయ్య అనే రైతుకు స్టార్టర్ వైరు కాలిపోయి సుమారు రూ.10 వేల నష్టం వాటిల్లిందని, అంతేకాకుండా బొల్లు రాజేష్ అనే రైతుకు చేలకలో ఉన్నటువంటి మొత్తం ట్రిప్పు కాలిపై సుమారు రూ.50 వేలపై చిలుక నష్టం వాటిలిందని తెలిపారు. బొల్లు రమణ చిలక పల్సర్ బండి కాలిపోయిందని, దీంతో పాటు పైపులు కాలిపోయి సుమారు రూ.80 వేలపైనే నష్టం వాటిల్లిందని తెలిపారు.
కొంపల్లి శ్రీశైలంకు వైరు డ్రిప్పు ఖాళీ సుమారు రూ.40 వేల నష్టం జరిగిందని చెప్పారు. మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేక దూర ప్రాంతాల నుండి ఫైర్ ఇంజన్ వచ్చేసరికి ఎక్కువ నష్టం వాటిలిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ మహబూబాద్ మరిపెడ సిబ్బంది, రమేష్, జీవన్, విశ్వనాథ్, రాజు, ఎండి పాషా, లచ్చిరాం, దేవోజి, నరేష్ తో పాటు గ్రామస్తులు అజీమ్, మురళి ఉన్నారు.



