Monday, May 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్25 హెచ్‌పి విద్యుత్తు నియంత్రికకు 5 హెచ్‌పి పంపు సెట్లు..

25 హెచ్‌పి విద్యుత్తు నియంత్రికకు 5 హెచ్‌పి పంపు సెట్లు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని నాగుల్ గావ్ గ్రామంలోని ప‌లు వ్యవసాయ రైతులకు సంబంధించిన వ్యవసాయ పంపు సెట్లు కొరకు 25 హెచ్‌పి విద్యుత్తు నియంత్రికకు 5 హెచ్‌పి పవర్ కలిగిన పంపుసెట్లు 5 అమర్చడం జరిగింది. ప్రస్తుతం ఎండలు పెరగడంతో రైతులకు 2026 రబిలో వివిధ రకాలైన పంటలను రైతులు వేసుకోవడం జరిగింది. అయితే గ్రామానికి చెందిన రామా నాగ్ నైక్ ఒక డిడి, నాగ్ నైక్ రామ్ నాయక్ ఒక డిడి, లోకండే మారుతి రెండు డీడీలు కట్టి ఉన్నారు. మొత్తం నాలుగు మోటర్ పంప్ సెట్‌లో విద్యుత్ శాఖ అనుమతితో నియంత్రికకు అధికారులు కనెక్ట్ చేశారు. ఇటీవలే తులసి రామ్ అనే రైతుకు సంబంధించిన 5వ రైతు ఇటీవలే నియంత్రికకు కనెక్ట్ చేయడంతో 25 హెచ్‌పి నియంత్రిక‌కు పవర్ సరిపోక విద్యుత్ మోటార్లు కాలిపోవడం జరుగుతుందని ఇప్పటికే ఆర్థిక నష్టం జరిగిందని అధికారులకు పలుమార్లు సూచించిన గత ఆరు నెలల నుండి పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రంగా మారిందని అన్నారు. ఇప్పటికన్నా రాబోయే ఖరీఫ్ సీజన్‌కు నియంత్రికకు ఓవర్ లోడ్ కావడంతో సమస్య పునరావృతం అవుతుందని అందుకే ముందస్తుగా విద్యుత్ శాఖ అధికారులు నిబంధనల ప్రకారం 25 హెచ్‌పి నియంత్రికు నాలుగు 5 హెచ్‌పి మాత్రమే పెట్టాలి కానీ ఐదు 5 హెచ్‌పి బోరు మోటార్లు కనెక్ట్ సమంజసం కాదని రైతులు వాపోయారు. విద్య శాఖ అధికారుల తీరు మార్చుకొని నిబంధనల ప్రకారం కరెక్ట్‌గా ఉన్న రైతులవి కనెక్ట్ చేసి అనుమతి లేని వాటిని తొలగించాలని రైతుల కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -