- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేలోపే, రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఏపీలో 47 మండలాల్లో తీవ్ర వడగాలులు, 88 మండలాల్లో వడగాలులు వీస్తాయని, తెలంగాణలో 2-3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ఉత్తర తెలంగాణలో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో, ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని సూచించారు.
- Advertisement -



