- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ‘కరుప్పు’ చిత్ర బృందం క్షమాపణలు తెలిపింది. చిత్రంలో ఇళయరాజాను ఉద్దేశించి వాడిన డైలాగులపై ఆయన బాధపడ్డారని తమ దృష్టికి రావడంతో, ఆ డైలాగులను తొలగిస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇళయరాజాను కించపరచడం తమ ఉద్దేశం కాదంటూ నోట్ విడుదల చేసింది. ఆయన మీద తమకు ఎంతో గౌరవం ఉందని, ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొంది. ఈరోజు నుంచే చిత్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఉద్దేశించిన డైలాగులను తొలగిస్తున్నట్లు తెలిపింది.
- Advertisement -



