వనపర్తి జిల్లా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. మణికుమార్
నవతెలంగాణ-వనపర్తి
అఖిల భారత కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ సంఘం పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీన బుధవారం నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త మందుల దుకాణాల బంద్‌కు వనపర్తి జిల్లా కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పూర్తి మద్దతు తెలుపుతున్నామని వనపర్తి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి పట్టణంలోని మెడికల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20వ తేదీన బందు పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మెడికల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. సురేష్ కుమార్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్‌లైన్ మందుల విక్రయాలను (GSR 817) వెంటనే నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్లను నియంత్రించి,నకిలీ మందుల బెడదను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపడతాం అని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎ. సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాల వల్ల సామాన్య మందుల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని , ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆన్‌లైన్ అమ్మకాలను నిలిపివేయాలి అని కోరారు. బంద్ కారణంగా రోగులకు కలిగే ఇబ్బందికి చింతిస్తున్నామని, అయితే అత్యవసర సేవల నిమిత్తం ప్రజల సౌకర్యం కొరకు ప్రధాన ఏరియాలలో కొన్ని షాపులు అందుబాటులో ఉంటాయని జిల్లా కమిటీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ టి. మద్దిలేటి, ట్రెజరర్ కె. మణి కుమార్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు.



