Wednesday, May 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువెంటనే పాలమూరు- రంగారెడ్డి భూసేకరణ చేయాలి

వెంటనే పాలమూరు- రంగారెడ్డి భూసేకరణ చేయాలి

- Advertisement -

ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలోని ఇతర ప్రాజెక్ట్‌‌ల్లోనూ
వేగం పెంచండి : అధికారులకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్థి సంస్థ(ఎంసీహెచ్ఆర్డీ)లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సంబంధిత అధికారులతో సమీక్ష‍ నిర్వహించారు. జిల్లా సాగునీటి ప్రాజెక్ట్‌‌లకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్ట్‌‌లకు సంబంధించి వీలయినంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి ప్రాజెక్ట్‌‌ల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సహా అనుబంధ ప్రాజెక్ట్‌‌లు పూర్తి చేయడం ద్వారా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. సమీక్ష‍లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయ ణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, రాకేశ్ రెడ్డి, వంశీకృ ష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్లకృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

-పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతాం
-నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని బీఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలోఉమ్మడి పాలమూరుకు చెందిన ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష‍ నిర్వహించారు. దేవాదుల, ఎస్ఎల్బీసీ సీతారామా ప్రాజెక్టులతో సమానంగా పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌‌లు పూర్తి చేసి సమృద్ధిగా సాగు, తాగు నీరు అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. పదిహేను రోజుల్లో పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రాజెక్ట్‌ పనుల పురోగతి పై సమగ్ర నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా ప్రాజెక్ట్‌‌ల్లో పూడికతీత పనులను వర్షాకాలం లోపు చేపట్టాలని సూచించారు.

పాలమూరు-రంగారెడ్డిని బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం ‌చేసింది : పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
పాలమూరు-రంగారెడ్డిని బీఆర్‌ఎస్‌ ‌నిర్లక్ష్యం చేసిందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని గాంధీభవన్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మాట్లాడుతూ 90 శాతం పూర్తి చేశామన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలు అబద్దాలని పేర్కొన్నారు. రెండేండ్లలో ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని 2015లో భూత్పూర్‌లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. పంపులు, మోటార్లు, సర్జ్ పూల్స్ కోసం రూ.35 వేల కోట్లు కేటాయించినా, పదేండ్లలో రూ.25 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లకు కనీసం అనుమతులు కూడా తీసుకురాలేదన్నారు. పాలమూరు–రంగారెడ్డి పూర్తి కావాలంటే రూ. లక్ష కోట్లు వ్యయం అవుతుందన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్ట్‌‌లకు కాంగ్రెస్ హయాంలోనే రూ.8500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం రూ.6300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -