సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే
కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ పత్రిక వార్షికోత్సవానికి రావాలని
ఆహ్వానించిన సీజీఎం, ఎడిటర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో బలమైన మిలిటెంట్ పోరాటాలతోనే కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతం అవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆగస్టు ఒకటో తేదీన నిర్వహించనున్న నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవానికి హాజరు కావాలంటూ ఆ పత్రిక సీజీఎం పి.ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేశ్… కూనంనేనిని మంగళవారం ఆహ్వానించారు. ఈ మేరకు వారు ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. వార్షికోత్సవం సందర్భంగా ‘రాజ్యాంగం-ప్రజాస్వామ్యం-పత్రికా స్వేచ్ఛ’ అనే అంశంపై నిర్వహించే సెమినార్‌లో ప్రసంగించాలని కోరారు. ఆ కార్యక్రమానికి తాను కచ్చితంగా హాజరవుతానని కూనంనేని సాంబశివరావు వారికి హామీనిచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజల పక్షాన వార్తలు రాసే పత్రికలు బలపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. ఆహ్వాన పత్రికను అందజేసిన వారిలో నవతెలంగాణ హెచ్‌ఆర్ జీఎం నరేందర్‌రెడ్డి, నవతెలంగాణ బోర్డు సభ్యులు, ప్రత్యేక ప్రతినిధి బి.బసవపున్నయ్య, బ్యూరో ప్రతినిధి అచ్చిన ప్రశాంత్ ఉన్నారు.
మిలిటెంట్ పోరాటాలతోనే కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



