- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పసిడి ధరలు బుధవారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,310 పెరిగి రూ.1,58,350కు చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరిగి రూ.1,45,150 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
- Advertisement -



