Wednesday, May 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ -జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మండల కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల కాంగ్రెస్ పార్టీ  ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రతి రైతు పండించిన పంటను కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శివానంద్, జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్, నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -