- Advertisement -
నవతెలంగాణ -జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మండల కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రతి రైతు పండించిన పంటను కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శివానంద్, జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్, నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



