Wednesday, May 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైల్వే కార్మికుల సేవలకే ‘శ్రమశక్తి’ అవార్డు

రైల్వే కార్మికుల సేవలకే ‘శ్రమశక్తి’ అవార్డు

- Advertisement -

డాక్టర్ చిలుకు స్వామికి  ఘన సన్మానం
నవతెలంగాణ – ఆలేరు రూరల్

సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్‌లో కార్మికుల సంక్షేమం,హక్కుల కోసం డాక్టర్  చిలుకు స్వామి అందించిన సేవలు ప్రశంసనీయమని,ఆ సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘శ్రమశక్తి అవార్డు’తో గౌరవించడం అభినందనీయమని మాజీ  ప్రభుత్వ విప్,మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత,టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు.ఆలేరు మండలం కొల్లూరు గ్రామ శివారులోని కేసీఆర్ ఫంక్షన్ హాలులో బుధవారం నిర్వహించిన డాక్టర్ చిలుకు స్వామి అభినందన సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.తెలంగాణ ప్రతిష్టాత్మక శ్రమశక్తి అవార్డుకు స్వామి ఎంపిక కావడం సాధారణ విషయం కాదని,దాదాపు 3600కు పైగా దరఖాస్తులలో ఆయన ఎంపిక కావడం విశేషమన్నారు.

కార్మిక నాయకుడిగా నిరంతరం సేవలందిస్తూ,కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకే ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.ఆలేరు మండలంలోని శారాజీపేట గ్రామంలో చిలుకు ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.రానున్న రోజుల్లో చిలుకు స్వామి మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి కార్మికులకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

‘శ్రమశక్తి’ అవార్డు గ్రహీత డాక్టర్  చిలుకు స్వామి నిరోష మాట్లాడుతూ.. ఈ అవార్డు తన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని,ప్రతి కార్మికుడి చెమటకు కష్టానికి దక్కిన గౌరవమని అన్నారు.అవార్డును అందజేసిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి,కార్మిక శాఖ మంత్రి జీ. వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచిన సౌత్ సెంట్రల్ రైల్వే సహోద్యోగులు, కార్మికులకు రుణపడి ఉంటానన్నారు.కార్మికుడు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని, రైల్వే ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, గుర్తింపు కోసం మరింత బాధ్యతతో పనిచేస్తానని తెలిపారు.ఈ శ్రమశక్తి అవార్డును దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

అనంతరం డాక్టర్ చిలుకు స్వామి–నిరోష దంపతులను రైల్వే ఉద్యోగులు, సిబ్బంది, శారాజీపేట గ్రామస్తులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. చిలుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.సమావేశానికి బండ మహేందర్ అధ్యక్షత వహించగా,కళాకారులు నృత్య ప్రదర్శనలు,గాన కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే  డివిజనల్ సెక్రెటరీ రవీందర్,తెలంగాణ జాబ్ కన్వీనర్, దేవులపల్లి రాఘవేందర్,సెక్రటరీలు రాజేందర్,ఏలేందర్ కుమారస్వామి,చైర్మన్ తిరుపతిరావు,ఆలేరు పిఎసిఎస్ చైర్మన్ మొగలగాని మల్లేశం,సర్పంచులు జూకంటి అనిల్, శారాజిపేట గ్రామ రెండవ వార్డ్ మెంబర్ చిలుకు నిరోష స్వామి,ఆలేరు మున్సిపల్ 1 వ వార్డు కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్,నాయకులు గంగుల శ్రీనివాస్,పుట్ట మల్లేశం,సిరమైన వెంకటేష్ యాదవ్, రచ్చ రామ్ నరసయ్య,మాదాని పిలిప్, గ్యాదపాక నాగరాజు, కంతి మహేందర్,గ్యదపాక నాగరాజు,మొరిగాడి వెంకటేష్,గడ్డమీద రవీందర్,జనగాం  వెంకట పాపి రెడ్డి,బెంజరపు రవి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -