Thursday, May 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమోడీ ‘పొదుపు’ మర్మం- పది సూచనలు

మోడీ ‘పొదుపు’ మర్మం- పది సూచనలు

- Advertisement -

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ‘డబులింజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలలో పాలన అద్భుతం, అమోఘం యావత్ దేశ అభివృద్ధి వికసిత్ భారత్ వైపు దూసు కెళ్తుంది. రాష్ట్రాల పాలనలో అన్ని రంగాల్లో ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని’ ఊదరగొట్టిన ప్రసంగాలకు, మీడియా కల్పిం చిన విస్తృత ప్రచారం చూసి ప్రజలు నిజంగానే నమ్మారని పిస్తోంది. ఆయా రాష్ట్రాలలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని బీజేపీ పాలిత రాష్ట్రాలలో, కేంద్రంలో అన్ని రంగాల్లో పరుగులు పెడుతూ ఆర్థిక వ్యవస్థ స్వర్ణయగంలో నడుస్తుందని మోడీ భజనపరులు కీర్తిస్తున్నారు. తొందర్లోనే ప్రపంచ ఆర్థిక అగ్రగామి దేశంగా భారత్ ఎదుగుతుందని కొందరు మేధావులు కూడా తమ అంచనాలతో అనేక విశ్లేషణలతో మోడీని విశ్వ గురువు అనుకుంటున్నారు. ఇదంతా చూసి ఎన్నికల మాయలో పడిన ప్రజలు ఓట్లను వేసి గెలిపిస్తే.. వారం తిరగకముందే. దేశమం తటా తిరుగుతూ ‘దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రజలు దేశభక్తిని చాటుకోవాలంటూ’ ఉచిత పొదుపు సూత్రా లను వల్లెవేస్తూ, ప్రజలు దుబారా ఖర్చును తగ్గించుకోవాలని కర్తవ్య బోధన చేస్తున్నారు.

దేశ ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించే తన కర్తవ్యాన్ని, తన దుబారా ఖర్చులను తగ్గించుకో వడం మర్చిపోయి ఈ ఆర్థిక సంక్షోభ భారాన్ని దేశభక్తితో సామాన్య ప్రజలు భరించాలని చేతులు దులుపుకోవడం తన పన్నెండేండ్ల పాలన పతనావస్థ స్థితికి చేరిందని చెప్తున్నట్లే. రాజభోగాలు అనుభవించేది పాలకులు, ధనికులైతే… త్యాగాలు చేసేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద ప్రజలా? ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వ దేశమా? పాలకులు, ధనికులు విచ్చలవిడిగా విదేశీ పర్యటనలతో ప్రభుత్వ సొమ్మును దుబారా ఖర్చు చేయవచ్చు. బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవచ్చు. ప్రభుత్వ చేపట్టే ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు కమిషన్ల పేరుతో తమ జేబులు నింపుకోవచ్చు. పన్నుల పేరుతో ప్రజల నుంచి లక్షల కోట్లు లాక్కొని బడా కార్పొరేట్ కంపెనీలకు సబ్సిడీలు, రుణమాఫీలు చేయవచ్చు. ఆదాని, అంబానీలకు లక్షల కోట్ల ప్రాజెక్టులు అప్పనంగా అప్పగించవచ్చు.

కానీ వారిని మాత్రము దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలపై అనేక భారాలు మోపి సంపాదించిన తమ సంపదనలో కొంత దేశానికి ఇవ్వమని, ఆర్థిక త్యాగం చేయమని, దేశ ప్రజలను ఆదుకోమని కోరలేని అసమర్ధ ప్రభుత్వం నడుస్తున్నదని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా పట్టించుకోని పరిస్థితి.ఏదో తెలంగాణకు వచ్చి రాష్ట్ర ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తాడను కుంటే, ఏకంగా దేశ ప్రజలకే తొమ్మిది సూచనలు చేస్తూ కొన్ని వారాలలో దేశం ఆర్థిక సంక్షోభంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొం టుందనే సాంకేతాలు, ముందస్తు హెచ్చరికలు ఇవ్వడంతో దేశ ప్రజలకు ఒకింత ఆశ్చర్యకరమైన షాక్ ఇచ్చాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మోడీ చేసిన తొమ్మిది సూచనలపై సామాన్య ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి, ఎలక్ట్రిక్ వాహనాలు కొను గోలు చేయాలి, బంగారం కొనొద్దు, విదేశీ టూర్లు, డెస్టినేషన్ వెడ్డింగ్ ల మోజులు వదిలిపెట్టాలి, మధ్యతరగతి వర్గాలు విదేశీ మోజును వదులుకోవాలి, సొంత వాహనాలు వదిలి మెట్రో, బస్సుల్లో తిరగాలి, వంటనూనెల, యూరియా, ఇతర ఎరువుల వాడకాన్ని తగ్గించాలి.

వర్క్ ఫ్రం హోం, ఆన్‌‌లైన్‌ మీటిం‌గ్‌‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఇంట్లో వాడే నిత్యావసర వస్తువుల సరుకులను కొనడంలో కోత పెట్టుకోవాలి అంటూ సామాన్య ప్రజలపై భారం మోపుతూ వారి నిత్య జీవన అవసరాలను దుబారా అనడం మోడీ అసమర్థ పాలన కు, దేశభక్తికి సంబంధం లేకున్నా భౌతిక, అభౌతిక అంశాలను జోడించడం గాల్లో దీపం పెట్టి ప్రార్థన చేయడం లాంటిదే.దేశాన్ని ఆర్థికసంక్షోభంలోకి నెట్టిన మోడీ పాలన సమయం లో రాజకీయ నాయకులు, ధనవంతులు, బడా కార్పొ రేట్ కంపెనీలు ఇవి పాటిస్తే సంక్షోభం మన దరికిరాదు. 1. ప్రభుత్వ ప్రాజెక్టు లలో, ఇతర ప్రభుత్వ పనులలో జరిగే అవినీతి పర్సంటేజ్ లను ఒక సంవత్సరం తీసుకోకుండా ఉంటే చాలు. 2. రాజ కీయ నాయకులు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి. 3. రాజకీయ నాయకులు తమ మీటింగులు, ఎలక్షన్ల పేరుతో రాష్ట్రాలు, జిల్లాలు తిరుగుతూ అనవసర దుబారా ఖర్చులతో బహిరంగ సభలు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్ట కుండా పెట్టకుండా, వారి సమయాన్ని డబ్బుల ను వృధా చేయకుండా, పెట్రోల్, డీజిల్ ను ఆదా చేసే విధంగా బీజేపీ, ఇతర పార్టీల మీటింగ్లు ఒక సంవత్సరం ఆన్‌‌లైన్‌, వర్చువల్ గా పెట్టుకోవాలి.

వందల కార్లతో రోడ్ షోలు, ర్యాలీ లు, విమానాలలో తిరగడం, హంగు ఆర్భాటాలతో సభలు, సమావే శాలు, విందులు ఏర్పాటు చేసుకోవడం పూర్తిగా ఒక సంవత్సరం వదులుకోవాలి.4. ప్రధాని, ఇతర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు అందరు కూడా పెట్టుబడుల పేరుతో, ప్రాజెక్టుల విజిటింగ్‌‌ల పేరుతో మాటిమాటికి విదేశీ టూర్లకు వెళ్లి ప్రజల సొమ్ముతో దుబారా ఖర్చు చేయడం ఒక సంవత్సరం బందు చేసుకోవాలి. 5. రాజకీయ నాయకులు చేసుకునే విందులలో వాడే వంట నూనెలను వాడకాన్ని ఒక సంవత్సరం తగ్గించు కోవాలి. 6. రాజకీయ నాయకులకు ఉండే వందల ఎకరాల భూములకు సామాన్య రైతులకు అందడం కంటే ముందు వెళ్లే అత్యధిక యూరియా, ఇతర ఎరువులను వాడకని ఒక సంవ త్సరం పూర్తిగా బంద్ చేసుకోవాలి.7. రాజకీయ నాయకులు ప్రభుత్వ ప్రజల సొమ్ముతో విలాసవంత మైన సౌకర్యాలు అనుభవించకుండా వారి నెల వారి ఖర్చులను పూర్తిగా వదు లుకోవాలి.8. ప్రధానితో సహా ఇతర రాజకీయ నాయ కులు అందరూ తమ సొంత వాహ నాలను వదిలి మెట్రో రైలు, బస్సులలో ప్రజలతో కలిసి సమస్యలు తెలుసు కుంటూ ప్రయాణించాలి.

9. రాజ కీయ నాయకులు, ఆదాని, అంబానీ బడా కార్పొరేట్ కంపెనీల యజమాన్యాలు ఏసీల వాడకాన్ని తగ్గించుకోవాలి. ఇవన్నీ ముందు రాజకీయ నాయ కులు, ధనవంతులు పాటిస్తేనే కదా సామాన్య ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలు తెలుస్తాయి. 10. కల్తీ, నకిలీ వస్తువుల ఉత్పత్తి చేసే కంపెనీల అనుమతులను రద్దు చేసి, పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే రసాయన ఎరువులు లేని పంటలను రైతులు పండిస్తారు. దేశ ఆర్థిక స్థితిలో గతి తప్పిన మోడీ పాలనలో ఒక్కసారిగా ఉరుములు ఉరిమి, పిడుగులు పడ్డట్టు ముందస్తు జాగ్రత్తలు లేకుండా మోడీ ఉన్న ఫలనా అకస్మిక పొదుపు సూచనలతో ముఖ్యంగా సామాన్య ప్రజలు, వలస కూలీలు, ఉద్యోగస్తులు, చిరు వ్యాపారస్తులు ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. బంగారం కొనుగోలు చేయొద్దంటూ చెబుతున్న మోడీ, బంగారం, వెండి దిగుమతి సుంకం, సెస్సులను ఏకంగా 6 నుంచి 15శాతం పెంచితే బంగారాన్ని కొనకుండా ఉంటారా? ఆర్థిక శాస్త్రంలో సాధారణంగా ఏదైనా వస్తువు ధర పెరిగితే దాని డిమాండ్ తగ్గుతుంది. కానీ దానికి విరుద్ధంగా గిఫెన్ వైపరీత్యంలో విలువైన వస్తువుల ధర ఎంత పెరిగితే అంత డిమాండ్ పెరు గుతుంది.

అది బంగారం, వెండి, మద్యం, ఇతర విలువైన విలాస వస్తువుల విషయంలో వాటి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. ఇది కాదనలేని అర్థశాస్త్ర సూత్రం. దీన్ని మోడీ ప్రభుత్వం గ్రహించే ప్రజల సొమ్మును ముక్కు పిండి వసూలు చేయాలని ఆ వస్తువుల ధరలు పెంచింది. ఈ ప్రభావంతో అనేక వస్తువు ఉత్పత్తి కంపెనీలు దివాలా తీస్తే అక్కడ పని చేసే కోట్ల మంది ఉపాధి కోల్పోయి, వస్తువు కొనుగోలు శక్తి నశించి రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాన్ని చూపించకుండా. దేశం కోసం ప్రజలు త్యాగం చేయాలి అనడం అసమర్థ పాలనకు నిదర్శనం కాకపోతే ఇంకేం అనుకోవాలి? మోడీ ఎత్తుకున్న పొదుపు భక్తి రాగానికి దేశ ప్రజలలో కరోనా కాలం నాటి భయానక సంక్షోభాన్ని, ప్రాణనష్టాన్ని మళ్లీ ఎదుర్కోవాల్సి వస్తుంది అనే భయం, ఆందోళన మొదలయింది. ఆయన పొదుపు సూత్రాల వల్లెవేయడం అయిందో లేదో పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3 వడ్డించారు. ఇప్పటికే రూపాయి విలువ రికార్డు స్థాయిలో దిగజారి వందకు చేరువలో పతనా స్థితికి వెళ్తోంది.

డాలర్ తో పోటీపడి ప్రపంచ ఆర్థిక రంగంలో అగ్రగామి దేశంగా ఎలా నిలుస్తుంది? 500 ట్రిలియన్ డాలర్లకు ఎప్పుడు చేరువ వుతుంది? స్వదేశీ వస్తువుల ఉత్పత్తి లక్ష్యంగా దేశ ఆర్థిక ప్రణాళి కలను, అభివృద్ధి లక్ష్యాలను పెట్టుబడిదారుల, విదేశీ వస్తు దిగు మతుల కేంద్రంగా కాకుండా సుస్థిర అభివృద్ధితో గ్రామీణ ప్రజల స్వయం సమృద్ధి, స్వయం ఉపాధి కేంద్రంగా మార్చా ల్సిన సమయం ఆసన్నమైంది. దీనికోసం స్వార్థ రాజకీయ అక్రమా ఆర్థిక ప్రయోజనాలను వదులుకోవాల్సిందే.భవిష్యత్తులో మోడీ సూచించిన తొమ్మిది సూచనలతో తాత్కాలికంగా వస్తువుల కొరత ఏర్పడి, ప్రజల డిమాండ్‌‌కు అనుగుణంగా వస్తు సప్లయ్‌ లేకపోవడంతో ధరలు కొనలేని స్థితిలో పెరిగే అవకాశాన్ని సూచిస్తుంది. దాంతో ద్రవోల్బణం పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల ఆదాయానికి కార్పొరేట్ కంపెనీల ఆదాయానికి మధ్య తీవ్రమైన వ్యత్యాసాన్ని సూచిస్తూ ఊహించని నష్టాన్ని కలగజేస్తుంది. ఇప్పటికే అమెరికా, ఇజ్రా యిల్, ఇరాన్ యుద్ధం కారణంగా అనేక దేశాలు ఆర్థిక సంక్షో భంలోకి నెట్టివేయబడుతున్నాయి. ఈ పరిస్థితులు ఇంకా కొన సాగితే ప్రజల జీవన విధానాలు స్తంభించి, మరో తీవ్రమైన ఆర్థిక మాంద్యం ప్రపంచం ఎదుర్కోక తప్పని పరిస్థితి వస్తుంది.

డాక్టర్. మండ్ల రవి 9177706626

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -