- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పాతబస్తీ మదీనా చౌరస్తాలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్‌వైజే కాంప్లెక్స్‌లోని వస్త్రదుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుకాణాలు తెరవకముందే అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పిందని భావిస్తున్నారు.
- Advertisement -


