Thursday, May 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమదీనా చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం..

మదీనా చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పాతబస్తీ మదీనా చౌరస్తాలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్‌వైజే కాంప్లెక్స్‌లోని వస్త్రదుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుకాణాలు తెరవకముందే అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పిందని భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -