నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఉన్నత పాఠశాల యందు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం గురువారం నిర్వహించినారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మద్దికుంట శ్రీనివాస్ మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలో కనీసం 10% విద్యార్థుల సంఖ్యను పెంచాలని, విద్యార్థుల సంఖ్యను పెంచడంలో ప్రముఖ పాత్ర పోషించే అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్పీలు చురుకుగా, ఉత్సాహంగా పాల్గొని ఇంటింటికి వెళ్లి తమ ఆవాసంలో గల విద్యార్థులను గుర్తించి పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరడం జరిగింది.
విద్యార్థుల యొక్క వివరాలను విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా తాము నిర్వహించే బడిబాట కార్యక్రమంలో తమ సహాయ సహకారాలు అందించి పాఠశాల ఉపాధ్యాయుల వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొనడానికి సహకరించాలని కోరడం జరిగింది. పాఠశాల కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్పీలు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ ఉన్నత పాఠశాల యందు బడిబాట కార్యక్రమం నిర్వహించినారు.



