Thursday, May 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకంటైనర్‌లో మంట‌లు..కొత్త కార్లు దగ్ధం

కంటైనర్‌లో మంట‌లు..కొత్త కార్లు దగ్ధం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కొత్త‌కార్ల‌ను తీసుకెళ్తున్న కంటైనర్ లారీలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. మంటల ధాటికి ప‌లు కార్లు దగ్ధమైనట్టు అధికారులు గుర్తించారు. ప్ర‌మాద స‌మ‌యంలో కంటైనర్‌లో 8 కార్లు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్ర‌మాదం మెద‌క్ జిల్లా 44వ జాతీయ రహదారిపై నాగులపల్లి బ్రిడ్జి వద్ద జ‌రిగింది.

సమాచార మందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్నిప్రమాదంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -