నవతెలంగాణ-మర్రిగూడ
ప్రభుత్వ వైద్య,ఆరోగ్య శాఖలో అతి కీలకమైన వైద్య విధాన పరిషత్ లో గత కమిషనర్ మే నెలలో పదవీ విరమణ చేసినప్పటికీ ఇంతవరకు ఆ స్థానంలో పూర్తిస్థాయి పర్యవేక్షణాధికారిని నియమించక పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి జాయింట్ యాక్షన్ కమిటీ,మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో హాస్పిటల్ సూపరిండెంట్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ప్లక్ కార్డ్స్ ఫట్టుకొని వైద్య బృందం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ & కమిషనర్ ను నియమించాలి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సికాసింగ్,హెడ్ నర్సులు లలిత,లూసి,శ్రీదేవి,స్టాఫ్ నర్సులు దుర్గ, ప్రమీల, జానీ బాబా, ఏఎన్ఎంలు, అనురాధ,సునీత,మంగమ్మ, జ్యోతి,సంతోష్ కుమార్, బషీద్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య విధాన పరిషత్ కు కమిషనర్ ను నియమించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



