- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు, కారు డ్రైవర్‌తో సహా ఐదుగురు ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. భూపేంద్ర సింగ్ చుఫాల్ తన కుటుంబంతో కైంచి ధామ్ ఆలయానికి వెళ్తుండగా.. ధైలా గ్రామం వద్ద కారు అదుపుతప్పి సుమారు 500 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో భూపేంద్ర సింగ్ చుఫాల్ (48), సీమా కైదా చుఫాల్ (45), వాసు చుఫాల్ (19), రవి చుఫాల్ (12), డ్రైవర్ అనుజ్ కుమార్ మిశ్రా (34) మరణించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



