Saturday, July 25, 2026
E-PAPER
Homeజాతీయంజంతర్ మంతర్ ర్యాలీపై15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

జంతర్ మంతర్ ర్యాలీపై15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జూలై 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్న యువతపై ఢిల్లీ పోలీసులు 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, 130 మంది పోలీసులు, సుమారు 65 మంది విద్యార్థులు గాయపడ్డారని పేర్కొన్నారు. అసాంఘిక శక్తులను గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్’ (FRS) కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. “అటువంటి వ్యక్తులను పోలీసులు ఇప్పటివరకు 2,000 మందికి పైగా గుర్తించారు,” అని పోలీసు వర్గాలు తెలిపాయి.

అయితే ఢిల్లీ పోలీసుల తీరు పట్ల సీజేపీ ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమపై పోలీసులు అనైతికంగా వ్యవహరించిన వీడియోలు, ఫోటొలు అందజేస్తామని, వారిని గుర్తించి, కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుత నిరసన కారులపై లాఠీచార్జీ చేసి తలలు పగలగొట్టి, వీధుల్లో ఈడ్చుకెళ్లి, తమ వాలంటీర్ల పక్కటెముకలు విరగ్గొట్టిన, యువతులపై చేయి చేసుకున్న పోలీసు సిబ్బంది జాబితాను తాము కూడా ఢిల్లీ పోలీసులకు ఇస్తాము. తాము వారిని FRS ద్వారా కాకుండా ప్రజల ద్వారా గుర్తిస్తాము. ఆ వివరాలను బహిర్గతం చేస్తాము. దీనిపై ఢిల్లీ పోలీసులు ఏమంటారో చూద్దామని ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

కాగా, జూలై 20న, జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వైపు సాగిన “సంసద్ చలో” ర్యాలీలో వేలాది మంది యువత పాల్గొన్నారు. శాంతియుతంగా సాగుతున్న యువత ర్యాలీపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేయడంతో వందల సంఖ్యలో యువత గాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -