- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్య అమెరికాలోని హోండూరస్‌లో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో మొత్తం 25 మంది మృతి చెందారు. ట్రుజిల్లో ప్రాంతంలోని ఓ తోటలో కార్మికులపై దుండగులు కాల్పులు జరపగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. భూవివాదాల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. మరోవైపు గ్వాటెమాలా సరిహద్దు సమీపంలో పోలీస్ కాన్వాయ్‌పై జరిగిన కాల్పుల్లో ఆరుగురు పోలీసులు మృతి చెందారు. ఈ రెండు ఘటనలపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.
- Advertisement -



