నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధం అలుముకోనుంది. ఇరాన్-అమెరికాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో శాంతి చర్చలు ఓ కొలిక్కి రావడంలేదు. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే ఇరాన్ గగనతలాన్ని మూసివేసింది. ఈ క్రమంలోనే గల్ప్ దేశాలు అప్రమత్తమైయ్యాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో శనివారం తన ఒమన్ బదర్ అల్బుసైదీతో ఫోన్‌లో సంభాషించినట్లు ఇరాన్ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది.
ఇరు దేశాలు దౌత్యపరమైన ప్రయత్నాలపై చర్చించి, యుద్దం ముగింపునకు ముందుకు రావాలని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని కోరారు. శాంతి చర్చలతోనే సమన్వయం నెలకొంటుందని సూచించాయి.



