Sunday, May 24, 2026
E-PAPER
Homeజాతీయంఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి

ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి

- Advertisement -

కొనుగోలు కేంద్రాల వ‌ద్ద ధాన్యం త‌డిస్తే ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాలి
ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌పై జ‌న‌సేన 
కేసులు ఉప‌సంహ‌రించుకోవాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ


న్యూఢిల్లీ : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేయాల‌ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యద‌ర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాల పంపిణీ, ఉద్యోగాల కల్పన, ఇందిరమ్మ ఇండ్లు సహా ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం నెరవేర్చాల‌న్నారు. ఢిల్లీలో మూడ్రోజుల పాటు జ‌రుగుతున్న‌ సీపీఐ(ఎం) కేంద్ర క‌మిటీ స‌మావేశానికి హాజ‌రైన ఆయన శనివారం హ‌రికిష‌న్ సింగ్ సూర్జిత్ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విద్యకు ప్రోత్సాహం అందించాల‌ని, ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు మంత్రివ‌ర్గంలో చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. రాష్టంలో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే కొనుగోలు చేయాల‌ని కోరారు. అక్క‌డ ధాన్యం త‌డిస్తే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల‌ని డిమాండ్ చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో పేదల భూములను తీసుకుంటున్నార‌ని, రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్య‌తిరేక విధానాలను నిర‌సిస్తూ సీపీఐ(ఎం) నిరంతరం పోరాడుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై జనసేన పార్టీ పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాల‌ని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -