Wednesday, June 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఆదివారం కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు, నినాదాలతో కాటారం చౌరస్తా సందడిగా మారింది.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. పార్టీ బలోపేతానికి యువత ముందుండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మంథని డివిజన్ యూత్ అధ్యక్షుడు చీమల సందీప్, జిల్లా స్పోక్స్‌పర్సన్ పంతకాని సమ్మన్న, కాటారం మండల యూత్ అధ్యక్షుడు చీటూరి మహేష్ గౌడ్, నాయకులు తెప్పాల దేవేందర్ రెడ్డి, అంగజాల అశోక్, సంతోషం దేవేందర్ రెడ్డి, కాటారం టౌన్ అధ్యక్షుడు పసుల మొగిలి, ఆత్మకూరి కుమార్ యాదవ్, రాజేంద్ర ప్రసాద్, మహాదేవపూర్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు లేతకారి రాజబాపు, మలహార్ రావు మండల అధ్యక్షుడు బడితల రాజయ్య, నాయకులు వంశీవర్ధన్ రావు, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అజీజ్ తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -