Tuesday, May 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఒప్పందంపై తొందరపడం : ట్రంప్‌

ఒప్పందంపై తొందరపడం : ట్రంప్‌

- Advertisement -


అది కుదిరే వరకూ ఇరాన్‌ నౌకల దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టీకరణ
వాషింగ్టన్‌ :
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునే విషయంలో తొందరపడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. కీలక అంశాలపై అభిప్రాయబేధాలు కొనసాగుతున్నాయని ఆయన సంకేతం ఇచ్చారు. ఇరాన్‌తో జరుపుతున్న చర్చలను గట్టిగా సమర్ధిం చుకుంటూ 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా హయాంలో టెహ్రాన్‌తో కుదిరిన అణు ఒప్పందానికి, ప్రస్తుతం చర్చలలో ఉన్న ఒప్పందానికి మౌలికంగా తేడా ఉన్నదని తెలిపారు. ఈ మేరకు ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో సుదీర్ఘ ప్రకటనను పోస్ట్‌ చేశారు. గతంలో అమెరికా అనేక దారుణమైన ఒప్పందాలు కుదుర్చు కున్నదని, ఒబామా పాలనలో కుదిరింది వాటిలో ఒకటని విమర్శించారు. ఆ ఒప్పందం ద్వారా అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇరాన్‌కు దారి దొరికిందని అన్నారు. లాంఛనప్రాయమైన ఒప్పందం కుదిరే వరకూ, దానిని ధృవీకరించే వరకూ, దానిపై సంతకం చేసే వరకూ హార్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ నౌకల దిగ్బంధనం కొనసాగు తుందని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఒప్పందం కుదుర్చు కోవడానికి ఇరు పక్షాలు కొంత సమయం తీసుకోవాలని తెలిపారు. వ్యూహాత్మక హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరిచేందుకు వీలుగా ఇరాన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని, దానిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ శనివారమే ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా ట్రంప్‌ తాజా వ్యాఖ్యలపై ఇరాన్‌ ఇంకా స్పందించలేదు. ఒప్పందంలో కొన్ని భాగాలకు అమెరికా అభ్యంతరాలు చెబుతోందని ఇరాన్‌ అధికార వార్తా సంస్థ తస్నిమ్‌ తెలిపింది. విదేశాలలో స్తంభింపజేసిన నిధులను విడుదల చేయాలన్న ఇరాన్‌ డిమాండుకు అమెరికా ససేమిరా అంటోందని పేర్కొంది.

నిర్ణయాలలో ఇరాన్‌ జాప్యమే కారణం : అమెరికా
నిర్ణయాలు తీసుకోవడంలో ఇరాన్‌ జాప్యం చేస్తుండడంతో ఆదివారం ఒప్పందంపై సంతకాలు జరగలేదని ట్రంప్‌ ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఇరాన్‌ నౌకల దిగ్బంధనాన్ని అమెరికా తొలగిస్తుందని, దానికి బదులుగా హార్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు టెహ్రాన్‌ అంగీకరించిందని ఆయన తెలిపారు. శుద్ధి చేసిన యురేనియం నిల్వల అప్పగింతకు కూడా ఇరాన్‌ అంగీకారం తెలిపిందని అన్నారు. ప్రతిపాదిత ఒప్పందానికి ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా మొజ్తాబా ఖమేనీ అంగీకారం తెలిపారని అమెరికా విశ్వసిస్తోందని చెప్పారు.
జలసంధిని తెరవడం, సముద్ర యానంపై ఆంక్షలను సడలించడం పైనే ప్రతిపాదిత ఒప్పందం దృష్టి సారి స్తుందని అమెరికా అధికారులు అంటు న్నారు. ఒప్పందం కుదిరిన తర్వాత 60 రోజుల పాటు ఇరాన్‌ అణు కార్యక్రమంపై సంప్రదింపులు జరుగుతాయని వారు తెలియజేశారు.

రుసరుసలు…
ఇరాన్‌తో కుదుర్చుకోబోతున్న ఒప్పందం పై ప్రతిపక్ష డెమొక్రాట్లే కాకుండా అధికార రిపబ్లికన్లు కూడా విమర్శలు కురిపిస్తు న్నారు. ఒబామా హయాంలో కుదుర్చు కున్న అణు ఒప్పందాన్ని ఇది గుర్తుకు తెస్తోందని వారు మండిపడ్డారు. అమెరి కాకు మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్‌ ఆ ఒప్పందం నుంచి వైదొలిగారు. ప్రస్తుత ఒప్పందం యుద్ధం ముందు నాటి యాధాతధ స్థితిని తీసు కొస్తోందని డెమొక్రటిక్‌ సెనెటర్‌ క్రిస్‌ వాన్‌ హాలెన్‌ చెప్పారు. ఇరాన్‌తో చర్చలు జరపాలన్న ట్రంప్‌ నిర్ణయంపై ఆయన కన్సర్వేటివ్‌ భాగస్వాములు పెదవి విరిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -