Tuesday, May 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ ‌యుద్ధంతో ట్రంప్‌‌నకే ఎదురుదెబ్బ

ఇరాన్‌ ‌యుద్ధంతో ట్రంప్‌‌నకే ఎదురుదెబ్బ

- Advertisement -


మూడు నెలల తర్వాత విజయం కంటే వైఫల్యాలే ఎక్కువ అమెరికా అంతర్గత రాజకీయాలూ భారంగా మారిన వైనం
హార్ముజ్‌‌పై ఇరాన్‌ ‌పట్టు.. అణు కార్యక్రమం కొనసాగింపు
అమెరికా అధ్యక్ష‍ుడిని ఇబ్బందుల్లోకి నెడుతున్న పరిస్థితులు
వాషింగ్టన్‌ :
ఇరాన్‌‌తో యుద్ధం అమెరికా అధ్యక్ష‍ుడు డోనాల్డ్‌ ట్రంప్‌‌నకు తీవ్ర తలనొప్పిగా మారింది. యుద్ధం మొదలై దాదాపు మూడు నెలలు గడుస్తున్నా.. ఆయనకు ఆశించిన ఫలితం మాత్రం రాలేదని విశ్లేషకులు అంటున్నారు. యుద్ధాన్ని పూర్తి విజయంగా చూపించేందుకు ఇప్పటి వరకు ట్రంప్‌ ఎన్నో పాట్లు పడ్డారు. పలు సందర్భాల్లో, పలు వేదికలపై అనేక ప్రకటనలు చేశారు. సోషల్‌ ‌మీడియా వేదికగా కూడా అమెరికాదే విజయం అన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు. ఇందులో భాగంగా మీడియాను కూడా ట్రంప్‌ ‌నియంత్రిం చారు. అమెరికా అనుకూల వార్తల వ్యాప్తికి తీవ్ర ప్రయత్నాలే చేశారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయని ‘రాయిటర్స్‌’ తన విశ్లేషణలో తెలిపింది.

నెరవేరని ట్రంప్‌ ‌ప్రధాన లక్ష్యాలు
ఈ విశ్లేషణ ప్రకారం… అమెరికా-ఇజ్రాయిల్‌‌లు ఇరాన్‌‌పై యుద్ధం చేసినప్పటికీ.. ఇరాన్‌ ఏ మాత్రమూ వెనక్కి తగ్గలేదు. పైగా ప్రతిదాడులకు దిగుతూ అమెరికా, ఇజ్రాయిల్‌‌లకు ముచ్చెమటలు పట్టించింది. ఒక విధంగా చెప్పాలంటే సూపర్‌‌పవర్‌‌గా చెప్పుకునే అమెరికాకు ఇరాన్‌‌తో యుద్ధం అంతర్జాతీయంగా పరువు తీసినంత పని చేసింది. ఇరాన్‌ ఇప్పటికీ హార్ముజ్‌ ‌జలసంధిపై తన పట్టును కొనసాగిస్తోంది. అమెరికా చర్చల పేరుతో ఎంత ఒత్తిడి తెచ్చినా, బెదిరింపులకు దిగినా.. ఇరాన్‌ ‌మాత్రం అణు కార్యక్రమం విషయంలో మాత్రం ససేమిరా అంటోంది. ఈ విషయంలో తగ్గేది లేదని తెగేసి చెప్తోంది. ఇరాన్‌లో సుప్రీం లీడర్‌ ‌నేతృత్వంలో పాలన నిలకడగా ఉండటంతో ట్రంప్‌ ప్రకటించిన ప్రధాన లక్ష్యాలు ఏవీ పూర్తిగా నెరవేరలేదు. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్ముజ్‌ ‌జలసంధిని ఇరాన్‌ అడ్డుకునే సామర్థ్యాన్ని ప్రదర్శించడంతో గల్ఫ్‌ ప్రాంతం, అమెరికా మిత్ర దేశాలపై ఒత్తిడి పెరిగింది. ​

అమెరికా అధ్యక్ష‍ుడిపై విమర్శలు
​ట్రంప్ యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు ప్రకటించిన లక్ష్యాల్లో ప్రధానమైనది ఇరాన్ అణు ఆయుధ సామర్థ్యాన్ని పూర్తిగా అడ్డుకోవడం. కానీ యుద్ధం తర్వాత కూడా ఇరాన్ వద్ద అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఇంకా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత అవి నేలమాళిగల్లో దాచబడి ఉండొచ్చని ఒక అంచనా. భవిష్యత్తులో వాటిని తిరిగి ఉపయోగించి అణుబాంబు తయారీకి దారి తీసే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక మరో లక్ష్యమైన ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా గుంపులను అణచివేయడంలో కూడా ట్రంప్ విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. యుద్ధం తర్వాత అధికా రంలోకి వచ్చిన కొత్త ఇరాన్ నాయక త్వం మరింత కఠిన వైఖరిని అవలంబిస్తోందని, వారి వద్ద ఇంకా క్షిపణులు, డ్రోన్లు ఉండటంతో ప్రాంతీయ భద్రతా ముప్పు కొనసాగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.​

అమెరికన్లలోనూ ట్రంప్‌‌పై పెరుగుతున్న అసంతృప్తి
అమెరికా అంతర్గత రాజకీయాల్లో కూడా ఈ యుద్ధం ట్రంప్‌నకు భారంగా మారుతోంది. పెరిగిన పెట్రోల్ ధరలు, తగ్గుతున్న ప్రజాదరణ, నవంబర్ మధ్యంతర ఎన్నికల ముందు అమెరికన్లలో పెరుగుతున్న అసంతృప్తి ఆయనపై ఒత్తిడిని పెంచుతున్నాయి. మొదట పూర్తిగా మద్దతిచ్చిన రిపబ్లికన్ నాయకుల్లో కూడా ఇప్పుడు విభేదాలు కనిపిస్తుండటం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక యూరప్ మిత్రదేశాలతో అమెరికా సంబంధాలు మరింత దెబ్బతిన్నాయని, తమను సంప్రదించకుండా యుద్ధంలోకి వెళ్లిన ట్రంప్ నిర్ణయంపై అక్కడ అసహనం పెరిగిందని విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు చైనా, రష్యా వంటి శక్తివంతమైన దేశాలు అమెరికా సైనిక పరిమి తులను ఈ యుద్ధం ద్వారా అధ్యయనం చేశాయని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. రాబర్ట్‌ ‌కగాన్‌ అనే విశ్లేషకుడు ఈ పరిణామాలను అమెరికా ప్రతిష్టకు దెబ్బగా అభివర్ణించారు. ఇది వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్‌ ‌యుద్ధాల కంటే కూడా తీవ్రమైనదని వివరించారు. ఈ యుద్ధంలో అమెరికా చివరికి స్పష్టమైన విజయాన్ని సాధింస్తుందన్న నమ్మకం కూడా కనిపించడం లేదని ఆయన చెప్పడం గమనార్హం.
దీర్ఘకాలిక సంక్ష‍ోభంగా యుద్ధం
మొదట్లో అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ క్షిపణి నిల్వలు, నౌకాదళం, కీలక సైనిక నాయకత్వానికి భారీ నష్టం కలిగింది. అయితే వెంటనే ఇరాన్ ప్రతిస్పందిస్తూ హార్ముజ్‌ జలసంధిని అడ్డుకోవడం, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు చేయడం ద్వారా యుద్ధాన్ని దీర్ఘకాలిక సంక్షోభంగా మార్చిందని విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో అమెరికా తరఫున మధ్య్రప్రాచ్య దేశాలతో చర్చలు జరిపిన వ్యక్తి ఆరోన్‌ ‌డేవిడ్‌ ‌మిల్లర్‌ ‌మాట్లాడుతూ… ‘‘స్వల్పకాలంలో ముగుస్తుందని భావించిన యుద్ధం ఇప్పుడు దీర్ఘకాలిక వ్యూహాత్మక వైఫల్యంగా మారుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉన్న అమెరికా… తన కంటే తక్కువ శక్తిగల ఇరాన్‌ ‌ముందు ఇబ్బందులు పడుతున్న తీరు ట్రంప్‌ ‌ప్రతిష్టను దెబ్బతీస్తోంది’’ అని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -