బొద్దింక వ్యాఖ్యలు వైరల్ పై చీఫ్ జస్టిస్
న్యూఢిల్లీ : కోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా ‘బొద్దింక’ అన్న పదం ఉపయోగించడంపై ఆన్‌లైన్‌లో జరుగు తున్న రచ్చను భావోద్వేగాలపరంగా తీసు కోవద్దంటూ న్యాయవాదిని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సూర్యకాంత్ సోమ వారం తెలిపారు. ఈ వ్యాఖ్యలపై స్వయంగా ప్రధాన న్యాయమూర్తే వివరణ ఇచ్చినా కూడా ఇంకా ఆన్‌లైన్‌లో ఆ రభస ఆగకప ోవడంపై న్యాయవాది ఎన్.కె. గోస్వామి ఆందోళన వ్యక్తం చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. దానిపై చీఫ్ జస్టిస్ పై రీతిలో స్పందించారు. ఈ నెల 15న ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా భారత యువతను ప్రస్తావిస్తూ సిజె ఈ బొద్దింకలు అన్న పదాన్ని ఉపయోగించిన సంగతి తెలిసిందే. దానిపై ఆన్‌లైన్ వేదిక అయిన కాక్రోచ్ జనతా పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది.. దానిపై ఆ మరునాడే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వివరణ కూడా ఇచ్చారు. తనకు దేశ యువత పట్ల చాలా గౌరవం వుందని, కానీ తాను చేసిన వ్యాఖ్యలను మీడియాలోకి కొంత మంది తప్పుగా ఉటంచించాయని వివరణ ఇచ్చుకున్నారు. ‘డిజిటల్-రాజకీయ నిర్మాణమైన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకలాపాలపై దర్యాప్తు కోరుతూ సుప్రీం లాయర్ వేసిన పిటిషన్‌ను విచారణకు చేపట్టాల్సిన అత్యవసరం ఏమీ లేదని ప్రధాన న్యాయమూర్తి సోమవారం వ్యాఖ్యా నించారు. పిటిషనర్, అడ్వకేట్ రాజా చౌదరి ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేసన్ టెక్నాలజీ శాఖ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సిబిలను ప్రతివాదులుగా చేర్చారు.
మరీ భావోద్వేగంగా తీసుకోవద్దు
- Advertisement -
- Advertisement -



