Tuesday, May 26, 2026
E-PAPER
Homeజాతీయంసెప్టెక్‌ ట్యాంక్‌లో ఊపిరాడక ఆరుగురు మృతి

సెప్టెక్‌ ట్యాంక్‌లో ఊపిరాడక ఆరుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కలహాండి జిల్లాలోని కరియాఖుంటా గ్రామంలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక ఆరుగురు మృతి చెందారు. ట్యాంక్‌లో పనిచేస్తుండగా విషవాయువులు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిశా ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -