Tuesday, May 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘ఎపిక్‌’ నుంచి మెలోడీ పాట విడుదల

‘ఎపిక్‌’ నుంచి మెలోడీ పాట విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ‘సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది.. చంద్రుడు చూడని కొత్త వెన్నెలిది’ అంటున్నాడు హీరో ఆనంద్‌ దేవరకొండ. వైష్ణవీ చైతన్యతో కలిసి అతడు నటిస్తున్న ‘ఎపిక్‌’ సినిమా నుంచి తాజాగా తొలి పాట విడుదలైంది. ‘బేబీ’ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ జంట మళ్లీ కనిపించనుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘#90s’ వెబ్ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -