- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అన్నాడీఎంకేకు మరో షాక్ తగిలింది. అంబసముద్రం ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. ఇప్పటికే నిన్న ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పగా, ఇప్పుడు నాలుగో ఎమ్మెల్యేగా సుబాయా వైదొలగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన త్వరలోనే టీవీకేలో చేరనున్నట్టు సమాచారం.
- Advertisement -



