Tuesday, May 26, 2026
E-PAPER
Homeక్రైమ్అద‌న‌పు క‌ట్నం కోసం వేధింపులు..వివాహిత ఆత్మ‌హ‌త్య‌

అద‌న‌పు క‌ట్నం కోసం వేధింపులు..వివాహిత ఆత్మ‌హ‌త్య‌

- Advertisement -
  • పోలీసులకు బాధితులు ఫిర్యాదు
    నవతెలంగాణ-దర్పల్లి: అదనపు వరకట్న వేదింపులకు మరో అబల బాలాయింది. పెళ్ళాయిన ఏడాదికి అసువులు బాసిన సంఘటన మండలంలోని గోవింద్ పల్లి గ్రామములో మంగళవారం ఉదయం కర్రోళ్ళ లక్షిత 22 ఉరేసుకొని మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఇలఉన్నాయి. మోస్రా గ్రామనికి చెందిన పిట్ల మోహన్ కుమార్తెకు ఏడాది క్రితం మండలంలోని గోవింద్ పల్లి గ్రామనికి చెందిన కర్రోళ్ళ నెహ్రూతో వివాహం జరిగినది.

వివాహం అయిన రెండు నెలల నుండి తమ కూతురికి అదనపు కట్నం కొరకు అత్తరింటి వేదింపులు మొదలయ్యాయని,అత్త మామ భర్త ల వేదింపులతో గురై తమ కూతురు తమ వద్దకు వచ్చి రోధిస్తూ చెప్పేదాని ఆయన పలు మార్లు కూతురి సంసారం సజావుగా సాగాలని పలు మార్లు గ్రామస్తుల సమక్షంలో పంచాయతీలు జరిపి మెప్పించి వెళ్ళమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మారుతారనే ఆశతో తమ కూతురిని అత్తరింటి వద్ద వదిలి వెళ్ళమని,ఇలా చంపుతారని ఊహించలేదని రోదిస్తూ వారి ఆవేదన వెళ్లకక్కరు. సోమవారం సాయంత్రం మళ్ళీ రెండు లక్షల అదనపు కట్నం కొరకు వేదించారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

మంగళవారం రాత్రి సమయంలో వేదింపులకు భరించలేక అనుమనస్పందయంగా మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. అనుమనస్పంద కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శవాన్నిజిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి స్థానిక తహసీల్దార్ శాంత పంచనామా చేశారు.సిఐ భిక్షపతి కేసు పర్యవేక్షిస్తున్నారు . మోస్రా గ్రామస్తులు లక్షిత మృతి వార్తా విని అనేక మంది గోవింద్ పల్లి గ్రామనికి చేరుకొని ఉద్రేకంలో గొడవలు జరగకుండా గ్రామములో పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. మృతురాలి అత్త సత్తెవ్వ ,మామ రాజయ్య, భర్త నెహ్రూ లు ఫరారీలో ఉన్నట్లు తెలిసింది. జరిగిన సంఘటన వివరాలు తెలుసుకునేందుకు ఆసీపీ ఆసుపత్రికి చేరుకొని దర్యాప్తు చేశారు.ఉదయం నుండి గ్రామములో జరిగిన సంఘటనపై సిరికొండ ఎస్ఐ రామకృష్ణ,దర్పల్లి ఎస్ఐ వినయ్ ప్రత్యేక పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -