రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో కొణిదెల కుటుంబంలో సందడి నెలకొంది. తాజాగా రామ్‌చరణ్ సోషల్ మీడియా వేదికగా ‘డబుల్’ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన సతీమణితో కలిసి ఇంతకముందు దిగిన స్పెషల్ ఫొటోను పంచుకున్నారు. ‘మాకు ఒక బాబు, ఒక పాప జన్మించారని తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతగా భావిస్తున్నాం. మన జీవితంలో మహిళలే గొప్ప బలం. ప్రతి క్షణం మా వెంట నిలిచిన అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని రామ్‌చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ దంపతులకు ఇప్పటికే కుమార్తె క్లీంకార ఉన్న సంగతి తెలిసిందే. ఉపాసన శనివారం కవలలకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో చిరంజీవి సైతం మీడియాతో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ‘ఆ భగవంతడి దయ, హనుమాన్ కృపతో ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ జన్మించారు. ఉపాసనతో పాటు బిడ్డలిద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మా ఇంట శుభం కలగాలని ఎక్కడెక్కడి నుంచో కోరుకున్నారు. ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అభిమానులు దీన్ని పండగలా భావిస్తున్నారు. వారి ఆనందానికి అవధుల్లేవు’ అని పేర్కొన్నారు.
‘డబుల్’ ఆనందం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



