Monday, February 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఏగన్‌ హీరోగా 'హైకూ'

ఏగన్‌ హీరోగా ‘హైకూ’

- Advertisement -

ఏగన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘హైకూ’ చిత్ర హక్కుల్ని ప్రపంచ స్థాయి ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుందని నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తికాక ముందే డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకోవడం విశేషం. ఆదివారం ఉదయం ఈ సినిమా షూటింగ్‌ కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘పేరన్బు, తరమణి’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్‌ ముహూర్తపు సన్నివేశంపై క్లాప్‌ కొట్టి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సినిమాకు యువరాజ్‌ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్నారు.

విజన్‌ సినిమా హౌస్‌ బ్యానర్‌పై డా.డి.అరుళనందు, మాథ్యూ అరుళనందు నిర్మిస్తున్నారు. ‘జో’, ‘కోళి పన్నై చెల్లదురై’ చిత్రాల ఫేమ్‌ ఏగన్‌ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఆయన సరసన ‘మిన్నల్‌ మురళి’, ‘శేషం మైకిల్‌ ఫాతిమా’ వంటి చిత్రాల్లో మెప్పించిన ఫెమినా జార్జ్‌, అలాగే ‘కోర్ట్‌’ ఫేమ్‌ శ్రీదేవి అప్పళ్ల కథానాయికలుగా నటిస్తున్నారు. ‘జో’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాతో గుర్తింపు పొందిన హరిహరన్‌ రామ్‌ అడిషనల్‌ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ప్రియేష్‌ గురుస్వామి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీగా, శక్తి ప్రణేశ్‌ ఎడిటర్‌గా, ‘బేబీ’, ‘కోర్ట్‌’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలకు మ్యూజిక్‌ అందించిన విజయ్ బుల్గానిన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఈ చిత్రానికి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -