- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హాస్య నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జులై 28 అర్ధరాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1951లో గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించిన ఆమె రంగస్థల కళాకారిణిగా ప్రస్థానం ప్రారంభించి, అనంతరం తెలుగు చిత్రసీమలో సుమారు 300కు పైగా చిత్రాల్లో సహాయ, హాస్య పాత్రలు పోషించారు.
- Advertisement -



