Tuesday, July 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం..

జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా, ఆయనకు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ మేరకు వైద్యుల బృందం సోమవారం ఒక అధికారిక హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇటీవలే బాలకృష్ణ షూటింగ్ లో గాయపడగా, ఇప్పుడు ఎన్టీఆర్ కూడా గాయపడడంతో నందమూరి అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

కాగా, డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్య బృందం ఎన్టీఆర్‌కు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -