- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: వన్యప్రాణుల వేటగాళ్లే లక్ష్యంగా, ముప్పై మందితో కూడిన ప్రత్యేక బృందాలతో ఆదిలాబాద్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించారు. ఆరుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. వారి వద్ద నుంచి జింక కొమ్ములు, వలలు, జింక చర్మాలు, నెమలి ఈకలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అడే సునీల్, సోలంకి దాసు, రాథోడ్ గణేష్, కనక సాగర్, శంకర్, శ్రీనివాస్ అటవీ చట్టాలప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సదురు వ్యక్తులపై ఇదివరకు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలియజేశారు. చట్ట విరుద్ధంగా వన్యప్రాణులను వేటాడే వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలియజేయాలని కోరారు.
- Advertisement -



