అధికారులకు ఆర్‌డీఓ సన్మానం
నవతెలంగాణ -పరకాల
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో 104 పరకాల శాసనసభ నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించడం పట్ల పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి డిఎస్ వెంకన్న హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, బీఎల్‌వో సూపర్వైజర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) నిర్వహించిన సేవలను అభినందిస్తూ వారికి సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్‌డీఓ మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో, అంకితభావంతో పనిచేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ఇదే స్ఫూర్తితో ఎన్నికల సంఘం భవిష్యత్తులో చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో అధికారులు, సిబ్బంది చూపిన నిబద్ధత ప్రశంసనీయమని పేర్కొంటూ సన్మానితులను అభినందించారు. కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ పరిధిలోని సంబంధిత అధికారులు, తహసీల్దార్లు, బీఎల్‌వో సూపర్వైజర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ నమోదులో పరకాలది రాష్ట్రంలో ద్వితీయ స్థానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


