
చౌటుప్పల్ డివిజన్ లీగల్ సెల్ ఇంచార్జీ గంగాదేవి రవీందర్
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాటం చేసి ఢిల్లీ పెద్దలను ఒప్పించి ఇక తప్పదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మార్గమే శ్రేయస్కరం అనే పరిస్థితి తీసుకువచ్చి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటామని గురువారం గంగాదేవి రవీందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి తద్వారా యువతకు ఉపాధి కల్పన, యువ ఇన్నోవేటర్స్ కు ఇంజనీరింగ్, విద్యార్థుల సృజనాత్మకతకు, వ్యవసాయదారులకు,